పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

69. క. ఇలఁ బసిఁడి లేక యేసొ
మ్ములు గలుగునె తాను లేక మునుకొని జగముల్‌
పొలుచునె యది తాఁ గాదా
బలిబంధన శివముకుంద పరమానందా.

70. క. జీవునకుఁ గాక దేవుఁడు
దేవునికి న్వేఱె యొక్క దేవుఁడు గలడే
దేవుఁడు తానే యనఁ గను
భావజ్ఞుఁడు శివముకుంద పరమానందా.

71. క. మొదటను విత్తే జగమై
యదియే లేనట్టు దాని కగునాధారం
బది దీనియందె నిలుచును
పదిలముగా శివముకుంద పరమానందా.

72. క. అతులిత సుజ్ఞానముచే
క్షితిలోపల జీవముక్తిఁ జెందకయుంటే
వెతగాదె తాను బ్రతికిన
బ్రతుకెల్లను శివముకుంద పరమానందా.

73. క. తనువెత్తఁ జేటు కింకా
తను వెత్తఁగఁజూతు రేమొ తామసులు భువిన్‌
దనువు చెడి ముక్తి దొరకే
పని బూనరు శివముకుంద పరమానందా.

74. క. తలఁపునఁ గలిగినబంధము
తలఁపున నూడంగఁగొట్టి తా మించవలెన్‌
ములు ముంటఁ బుచ్చువిధమున
బలిబంధన శివముకుంద పరమానందా.

75. క. యాగంబులు మంత్రంబులు
యోగంబులు మగుడజన్మ మొసఁగును నకటా
యోగులకర్మము లుడుగఁగ
బాగాయెను శివముకుంద పరమానందా.

76. క. దానంబులు సత్క్రియలును