పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

303

నము. ధంసా ప్రపంచములో శ్రీవారు పోలవరము వలస వేంచేసినపుడు వకదుర్మార్గుడు శాసనం చెక్కి వేసినందున సర్వజనులు తెలిసి సంతోషించేటందుకు లేకపోగా ఆదుర్మార్గుడు పుత్రమిత్రకళత్రాదులతో నశించిపోయినాడు” (ఆలయములోని శాసనము).

ఈవిధముగా ధంసాదుర్నయము గ్రంథములందు శాసనములందు శాశ్వత మొనర్పఁబడెను. 105 వ పద్యమువలన ధంసా కధికార మిచ్చినవాడు విభరాహిముఖా నని తెలియును. క్రీ. శ 1687 లో ఔరంగజేబు తనపుత్రుఁ డగుమహమదు ఆజాముతో గోలకొండ ముట్టడింపవచ్చినపుడు తానీషాయెడ ద్రోహముతలఁచి గుట్టుతెలిపినవాఁడును స్వామిద్రోహియు నగు ఇబ్రహీమె యిందుఁ బేర్కొనబడిన యిభరాహిముఖాను. ఇతఁడు ఔరంగజేబు పాలనకాలమునఁ బ్రముఖుఁడై ధంసాచేత నింతలేసి పనులు చేయించెను.

తానీషా రాజ్యాంతమున ఇబ్రహీముకాలము నుండి ధంసా ప్రముఖుఁడయ్యెను. ఔరంగజేబు అంత్యకాలము ధంసా విజృంభణకాలము నొకటియె. శ్రీరాముఁడు పోలవరమునకు వలస యేగినది సర్వధారిసంవత్సరమున. అక్కడ నున్నది ఐదేండ్లు. తరువాత పూసపాటి విజయరామరాజు సీతారామరాజుల కాలమున విజయసంవత్సరమున