పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

304

దిరిగి భద్రగిరికి వేంచేసెను. వీని నన్నింటిని సమన్వయించితిమేని ధంసా భద్రగిరిమీదికి దండెత్తి రెండువందలసంవత్సరములై యుండునని చెప్పవచ్చును. ఇది ఔరంగజేబు అంత్యకాలమునకు పూసపాటి విజయరామరాజు రాజ్యారంభకాలమునకు సర్వధారివిజయసంవత్సరములకు జేరువగా నున్నది. కాలనిర్ణయమును గూర్చి మఱియొకమాటు విపులముగా వ్రాయనున్నారము.

ఇందలి కవిత సరళముగ సుబోధముగ నున్నది. భగవంతునిహృదయము వ్రచ్చి పోవునటుల యీకవి వ్రాసిన నిష్ఠురవాక్యములు కవి పరితాపాతిశయమును వెల్లడించుచున్నవి. శ్రీరాముఁడు పోలవరము వలస యేగుటతో కవి శతక మారంభించి తిరుగ వచ్చిన పిదప నైదేండ్లకుఁ బూర్తిచేసియుండును. పఠనీయశతకరాజములలో నిది యొకటి.

శ్రీ పిఠాపురము మహారాజావారు తాళపత్రప్రత్యనుసారముగా వ్రాయించిన వ్రాతప్రతి నాధారపఱచికొని యీభద్రగిరిశతకమునకు శుద్దప్రతి వ్రాసితిమి. యవనవిప్లవకాలమునాటి పరిస్థితుల దెలుపు శతకము గాన యాదరమునకుఁ బాత్రమగునని తలంచుచున్నారము.

నందిగామ

శేషాద్రిరమణకవులు

1-6-26

శతావధానులు