పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

శ్రీనాథుని వేంకటరామకవికృత అశ్వారాయచరిత్ర మునందుఁ గలవు. దేశద్రోహులగు కొందఱను తనలోకి గలిపి కొని గౌరవపాత్రము లగుసంస్థానములను బెక్కింటిని రూపుమాపి కడ కీతఁడు భద్రాచలమును ముట్టడించెను. పురవాసుల నందఱ నానావస్థలపాలు గావించెను. దేవళములోఁ జొరఁబడి విగ్రహముల నెక్కడఁ బాడుచేయునో యని యర్చకులు శ్రీరామాదివిగ్రహములను బోలవరమునకు రహస్యముగాఁ బడవలపై నెట్లో చేర్చిరి. భక్తులంచఱు దిక్కు చెడి ధంసాచే నవస్థలఁబడుచుండ నీవు సుఖముగాఁ బోలవరములోఁ దలదాఁచుకొంటివా రామా! నిన్నింతతో నీతురకలు విడువరని నిష్టురములాడుచు నీ పేరయకవి శతకమును రచించెను. ధంసా పరిపాలనము శ్రీ రామచంద్రుఁడు వలస కేఁగినట్లు భద్రాద్రిలోని శాసనమునందుఁ గలదు. దాని నిట నుదాహరించెదము.

"స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శా॥ శ॥ ౧౫౭౪ ఆగు నేటి వర్తమానవ్యవహారికచాంద్రమాన నందననామసం॥ వైశాఖ శు ౮ లు భానువారము శ్రీభద్రాచలసీతారామచంద్రమహాప్రభువువారిసన్నిధిని శ్రీ రామదాసుగారు తానీషాగారి యనుమతివెంబడిని జరిగించిన దేవబ్రాహణవృత్తులు శ్రీవారిసన్నిధిని జరుగు ఉత్సవప్రకరణములు వ్రాసియున్న శాస