పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



పీఠిక


ఈశతకము రచించినకవి భల్లా పేరయ. ఇతఁడు కౌండిన్యసగోత్రుఁడు లింగనకుఁ బౌత్రుఁడు పెద్దనకుఁ గుమారుఁడు. శతకకవులచరిత్ర మీశతకము నెఱుంగదు. కవి వైదికబ్రాహణుఁడై యుండును.

భద్రగిరిశతకము సింహాద్రి నారసింహశతకము వెంకటాచలవిహారశతకము మట్టపల్లి నృసింహశత కము తెగలోఁ జేరినది. యవనులు సైన్యసహితులై వచ్చి హైందవదేవాలయములను భగ్నముగావించు తఱి దేశమునందు బయలువెడలిన క్షోభ కీతెగశతకములు దృష్టాంతప్రాయములుగ నున్నవి. పరస్పరవైషమ్యములతో నిండియున్న ఆంధ్రులను లోబఱచికొని వారిమతమునకు దేశమునకు సంఘమునకు రాజ్యతృష్ణాపరవశులు మతోద్రేకులు నగుయవనులు గావించినదురంతములు తెలుపుచరిత్రకాలమునాటి యీ తెగశతకములు భావిచరిత్రమునకుఁ బరమప్రమాణములు కాఁగలవు.

నైజాము ప్రభువులవద్దనుండి సామాన్యసైనికోద్యోగిగా నియమింపఁబడిన ధంసాయను యవనుఁడు వేల్పుకొండ (ఇది ఒరంగల్లుసకు ౨౪ మైళ్ల దూరమునఁ గలదు) పై దుర్గములుగట్టి దేశము నాక్రమించుకొనుటకు బయలువెడలి యెన్నియో దురంతములు గావించెను. ఈతనిదురంతములు