పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. రసనాగ్రంబున నీదు నామరుచియున్‌ రమ్యంబుగాఁ జెవ్లుకు
న్నసలారంగ భవత్కథాభిరతియున్‌ హస్తాబ్జయుగ్మంబులన్‌
వెస నీపాదసుపూజితాదియుగమున్‌ విజ్ఞానమధ్యాత్మకున్‌
వెస నింపొందనివాఁడు దాఁ బశువు సూ వేదాత్మ, నారాయణా! 58

మ. వరకాళిందితరంగడోలికలలో వైకుంఠధామంబులో
వెర వొప్పార నయోధ్యలో మధురలో వ్రేపల్లెలో ద్వారకా
పురిలో నాడెడుభంగి నాదుమదిలో భూరిప్రసన్నాననాం
బురుహం బొప్ప నటించు టొప్పును సితాంభోజాక్ష, నారాయణా! 59

శా. చల్ల ల్వేఱొకయూర నమ్ముకొను నాసం బోవుచోఁ ద్రోవ నీ
వుల్లాసంబున నడ్డ కట్టి మదనోద్యోగానులాపంబులన్‌
చల్లన్‌ జల్లనిచూపు జల్లు మని గోపస్త్రీలపైఁ జల్లు మీ
చల్లంబోరుతెఱంగు జిత్తమున నే జర్చింతు నారాయణా! 60

మ. కలయ న్వేదములున్‌ బురాణములు బ్రఖ్యాతంబుగా తెల్పి మీ
వలనన్‌ భక్తి విహీనుఁ డైన పిదపన్‌ వ్యర్థప్రయత్నంబె పో
గులకాంతామణి గొడ్డు వోయిన గతిం గ్రొవ్వారుసస్యంబు దా
ఫలకాలంబున నీచపోవు పగిదిన్‌ పద్మాక్ష, నారాయణా! 61

శా. స్నానంబుల్‌ నదులందు జేయుట గజస్నానంబు