పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చందంబగున్‌
మౌనం బొప్ప జపించువేద మటవీ మధ్యంబులోనే డ్పగున్‌
నానాహోమము లెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యై చను
న్నీనామోక్తియు నీపదాబ్జరతియున్‌ లేకున్న నారాయణా! 62

మ. అల నీటం దగురొంపిపైఁ జిలికిన న్నానీటనే పాయు నా
యిల పాపంబులు దుర్భరత్వము మహాహేయంబునం బొందినం
బలువై జీవుని దొప్పఁదోఁగినవి యీబాహ్యంబునం బాయునే
పొలియుం గాక భవత్సుపాదజలముం బ్రోక్షింప నారాయణా! 63

మ. తనచిత్తాబ్జము మీపదాబ్జములకుం దాత్పర్యసద్భక్తి తం
తున బంధించిన బంధనంబు కతనం దుష్పాపపుంజంబు లె
ల్లను విచ్ఛిన్నములై యడంగు మహిమోల్లాసాబ్ధి యైనట్టి దా
సున కింపొందును మోక్షవైభవము దా సుశ్లోక నారాయణా! 64

మ. తనువుం జీవుఁడు నేక మైనపిదపన్‌ ధర్మక్రియారంభుఁ డై
యనయంబు న్మది దన్నెఱుంగక తుది న్నామాయచే మగ్నుఁ డై
తనుతత్త్వాదివియోగమైన పిదపం దా నేర్చునే నీదు ద
ర్శన మింపారఁగ భక్తివైభవ మహాసంకాశ నారాయణా! 65

మ. తనకున్‌ సాత్వికసంపదాన్విత మహాదాసోహభావంబునన్‌
ననయంబు న్మది నన్యదైవభజనం బారం