పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లోరగిల మే న్మువ్వంకలన్‌ బోవఁగా
నలి గైకొందువు గాదె నీవు మురళీనాట్యంబు, నారాయణా! 53

శా. మాపాలం గడు గ్రొవ్వి గోపికలతో మత్తిల్లి వర్తింతువే
మాపాలెంబుల వచ్చి యుండుదు వెస న్మాపాలలో నుండు మీ
మాపా లైనసుఖాబ్ధిలో మునుగుచున్‌ మన్నించి తా గొల్లలన్‌
మాపాలం గలవేల్పు వీవె యని కా మన్నింతు, నారాయణా! 54

మ. ఒకకాంతామణి కొక్క డీవు మఱియు న్నొక్కర్తె కొక్కండ వై
సకలస్త్రీలకు సంతతం బలర రాసక్రీడ తన్మధ్య క
ల్పకమూలంబు సవేణునాదరస మొప్పంగా బదార్వేల గో
పికలం జెంది వినోద మొందునెడ నీ పెంపొప్పు నారాయణా! 55

మ. లలితం బైన భవత్తనూవిలసనన్‌ లావణ్యదివ్యామృతం
బలుఁగు ల్వారఁగ నీకటాక్షమునఁ దా మందంద గోపాంగనల్‌
తలఁపు ల్పాదులు కట్టి కందళిత నూత్నశ్రీలు వాటింతు రా
నెలతల్‌ తీవెలు చైత్రవిస్ఫురణమౌ నీ యొప్పు నారాయణా! 56

మ. లీలన్‌ పూతనప్రాణవాయువులు పాలిండ్లందు వెళ్ళించి, దు
శ్శీలుండై చను బండిదానవు వెసం జిందై పడం దన్ని యా
రోల న్మద్దులు గూల్చి ధేనుదనుజున్‌ రోఁజంగ నీల్గించి వే
కూలన్‌ కంసునిఁ గొట్టి గోపికలకోర్కుల్‌ దీర్తు, నారాయణా! 57