పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అమరకాండత్రయంబరసి చూడఁగలేదు
శాస్త్రీయ గ్రంథముల్‌ చదువలేదు
నీ కటాక్షంబుననే రచించెదఁ గాని
ప్రజ్ఞ నాయది గాదు ప్రస్తుతింపఁ
తే. దప్పుగలిగిన సద్భక్తి తక్కువౌనె
చెఱకునకు వంకపోయిన చెడునె తీపు?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 2

సీ. నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత
దురితజాలములెల్ల ద్రోలవచ్చు
నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత
బలువైన రోగముల్‌ బాపవచ్చు
నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత
రిపు సంఘముల సంహరింపవచ్చు
నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత
దండహస్తుని బంట్లఁదఱుమవచ్చు
తే. భళిర నేనీ మహామంత్రబలముచేత
దివ్యవైకుంఠ పదవి సాధింపవచ్చు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 3

సీ. ఆదినారాయణా! యనుచు నాలుకతోడఁ
బలుక నేర్చినవారి పాదములకు
సాష్టాంగముగ నమస్కార మర్పణఁ జేసి
ప్రస్తుతించెదనయ్య బహువిధముల
ధరణిలో నరులెంత దండివారైనను
నిన్నుఁ గాననివారి నే స్మరింప