పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు



నరసింహశతకము



సీ. శ్రీ మనోహర! సురార్చిత సింధుగంభీర!
భక్తవత్సల! కోటిభానుతేజ!
కంజనేత్ర! హిరణ్యకశ్యపాంతక! శూర!
సాధురక్షణ! శంఖచక్ర హస్త!
ప్రహ్లాద వరద! పాపధ్వంస! సర్వేశ!
క్షీరసాగరశయన! కృష్ణవర్ణ!
పక్షివాహన! నీలభ్రమరకుంతలజాల!
పల్లవారుణపాదపద్మయుగళ
తే. చారుశ్రీచందనాగరుచర్చితాంగ!
కుందకుట్మలదంత! వైకుంఠధామ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 1

సీ. పద్మలోచన! సీసపద్యముల్‌ నీమీఁదఁ
జెప్పఁ బూనితినయ్య!చిత్తగింపు
గణ యతి ప్రాస లక్షణముఁ జూడఁగలేదు
పంచకావ్య శ్లోకపఠన లేదు