పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లం గ్రొవ్వారు దుష్టాత్ములం
బలిగాఁ జేయఁ దలంచి ధర్మ మెలమిం బాలించి నిల్పంగ మీ
వలనం గల్క్యవతార మొందఁగల నిన్‌ వర్ణింతు నారాయణా! 20

మ. ఇరవొందన్‌ సచరాచరప్రతతుల న్నెన్నంగ శక్యంబు కా
కరయన్‌ పద్మభవాండ భాండచయము న్నారంగ మీకుక్షిలో
నరుదార న్నుదయించుఁ బెంచు నడఁగు న్నన్నారికేళోద్భవాం
తర వాఃపూరము చంద మొంది యెపుడున్‌ దైత్యారి నారాయణా! 21

మ. దళదిందీవర నీలనీరద సముద్యద్భాసితాకార, శ్రీ
లలనా కౌస్తుభచారువక్ష విబుధశ్లాఘోద్భవస్థాన కో
మల నాభీచరణారవిందజనితామ్నాయాద్యగంగా! లస
జ్జలజాతాయతనేత్ర నిన్ను మదిలోఁ జర్చింతు నారాయణా! 22

మ. జగదాధారక భక్తవత్సల కృపాజన్మాలయాపాంగ! భూ
గగనార్కేందుజలాత్మపావక మరుత్కాయా! ప్రదీపప్రయో
గి గణస్తుత్య మహాఘనాశన! లసద్గీర్వాణ సంసేవితా!
త్రిగుణాతీత! ముకుంద! నాదు మదిలో దీపింపు, నారాయణా! 23

శా. భూతవ్రాతము నంబుజాసనుఁడవై పుట్టింతు విష్ణుండవై
ప్రీతిం బ్రోతు హరుండవై చెఱుతు నిర్భేద్యుండవై త్రైగుణో
పేతంబై పరమాత్మవై