పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిలుతు నీ పెంపెవ్వరుం గాన ర
బ్జాతోద్భూతసుజాతపూజితపదాబ్జశ్రేష్ఠ, నారాయణా! 24

మ. వరనాభీధవళాంబుజోదరమునన్‌ వాణీశుఁ గల్పించి య
ప్పురుషశ్రేష్ఠుని ఫాలమందు శివునిం బుట్టించి యామేటికిం
బరమోత్తంసముగా వియత్తలనదిం బాదంబులం గన్న మీ
సరి *యెవ్వారలు మీరు దక్కఁగ రమాసాధ్వీశ, నారాయణా! 25

  • యింకెవ్వరు నీవె కర్తవు రమాసంబంధ


మ. ప్రభ మీనాభి జనించినట్టి విలసత్పద్మోరుసద్మంబునం
బ్రభవంబైన విరించి ఫాలజనిత ప్రస్వేదసంభూతుఁడై
యభిధానంబును గోరి కాంచెను భవుం డార్యేశు లూహింపఁగా
నభవాఖ్యుండవు ని న్నెఱుంగవశమే యబ్జాక్ష, నారాయణా! 26

మ. పటుగర్భాంతరగోళభాగమున నీ బ్రహ్మాండభాండంబు ప్రా
కట దివ్యాద్భుతలీలఁ దాల్చి మహిమం గల్పాంత మంభోధిపై
వటపత్రాగ్రముఁ జెంది యొప్పిన మిము న్వర్ణింపఁగా శక్యమే
నిటలాక్షాంబురుహాసనాదికులకు న్నిర్వాణ, నారాయణా! 27

మ. సవిశేషోరు సువర్ణబిందువిలస చ్చక్రాంకలింగాకృతిన్‌
భవుచే నుద్ధవుచేఁ బయోజభవుచేఁ బద్మారిచే భానుచే
ధ్రువుచే నా దివిజాధినాయకులచే