పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షత్రవరుల న్నేపార నిర్జించి త
త్పరశుభ్రాజిత రామనామము కడున్‌ ధన్యంబు, నారాయణా! 16

మ. వరుసం దాటకిఁ జంపి కైశికు మఘ స్వాస్థ్యంబు గావించి శం
కరు చాపం బొగిఁ ద్రుంచి జానకిఁ దగం గల్యాణమై తండ్రిపం
పరుదారన్‌ వనభూమి కేఁగి జగదాహ్లాదంబుగా రావణున్‌
ధరణిం గూల్చిన రామనామము కడున్‌ ధన్యంబు, నారాయణా! 17

మ. యదువంశంబునఁ గృష్ణు కగ్రజుఁడవై *యాభీల శౌర్యోన్నతిన్‌
మదవద్ధేనుక ముష్టికా ద్యసురులన్‌ మర్దించి లీలారసా
స్పద కేళీరతి రేవతీవదన కంజాతాంతభృంగం బనన్‌
విదితంబౌ బలరామమూర్తివని నిన్‌ వీక్షింతు, నారాయణా! 18

  • యేపారునుద్దండతన్


మ. పురము ల్మూడును మూడులోకములు నేప్రొద్దు న్విదారింపఁ ద
త్పురనారీ మహిమోన్నతుల్‌ సెడుటకై బుద్ధుండవై బుద్ధితో
వరబోధద్రుమ సేవఁ జేయుటకునై వారిం బ్రబోధించి య
ప్పురముల్‌ గెల్చిన నీ యుపాయము జగత్పూజ్యంబు, నారాయణా! 19

మ. కలిధర్మంబునఁ బాపసంకలితులై గర్వాంధులై తుచ్ఛులై
కులశీలంబులు మాని హేయగతు