పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. నెరయ న్నిర్మల మైన నీ స్తుతికథానీకంబు పద్యంబులో
నొరుగుల్‌ మిక్కిలి గల్గెనేనియుఁ గడు న్యోగంబె చర్చింపఁగాఁ
గుఱుగ ణ్పైనను వంకబోయినఁ గడుం గుజ్జైనఁ బేడెత్తినం
జెఱకుం గోలకు తీపు గాక కలదే, చే దెందు, నారాయణా! 4

మ. చదువుల్‌ పెక్కులు సంగ్రహించి పిదపం జాలంగ సుజ్ఞాని యై
మదిలోఁ బాయక నిన్ను నిల్పఁ దగు నామర్మంబు వీక్షింపఁడే
మొదలం గాడిద చారుగంధవితతుల్‌ మోవంగ శక్యంబె కా
కది సౌరభ్యపరీక్ష జూడ కుశలే యవ్యక్త, నారాయణా! 5

మ. లలిఁ గబ్బంబు కరాట మివ్వసుధ నెల్లం న్మించెఁ బో నీకథా
వళి కర్పూరము నించిన న్నితరమౌ వ్యర్ధార్థకామోదముల్‌
పెలుచం బూనిన యక్కరాటము తుదిన్‌ బేతేకరాటంబె పో
చలదిందీవరపత్రలోచన, ఘనశ్యామాంగ, నారాయణా! 6

మ. మన మార న్నచలేంద్రజాధిపతికి న్మస్తాగ్రమాణిక్యమై
మునికోపానలదగ్ధ రాజతతికి న్ముక్తిస్ఫురన్మార్గమై
యెనయన్‌ సాయకశాయికిం జననియై యేపారు మిన్నేటికిం
జని మూలంబగు నంఘ్రి నాదు మదిలోఁ జర్చింతు, నారాయణా! 7

శా. నీ పుత్రుండు చరాచరప్రతతుల న్నిర్మించి పెం