పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

నారాయణశతకము

శా.

 శ్రీరామామణిపాణిపంకజ మృదుశ్రీతజ్ఞపాదా
బ్జ శృంగారాకారశరీర, చారుకరుణాగంభీర,
సద్భక్తమందారాంభోరుహపత్రలోచన కళా
ధారోరుసంపత్సుధాపారావారవిహార, నా దు
రితముల్‌ భంజింపు నారాయణా!

1


మ. కడకుం బాయక వేయినోళ్ళు గల యా కాకోదరాధీశుఁడున్‌
గడముట్ట న్వినుతింప లేక నిగుడన్‌ గ్రాలంగ నొప్పారు మి
మ్మడరన్‌ సన్నుతి సేయ నాదువశమే! యజ్ఞాని, లోభాత్ముఁడన్‌
జడుఁడ, న్నజ్ఞుఁడ, నైకజిహ్వుఁడ, జనస్తబ్ధుండ, నారాయణా! 2

శా. నే నీదాసుఁడ నీవు నాపతివి నిన్నే కాని యొండెవ్వరిన్‌
ధ్యానింపం బ్రణుతింప నట్లగుటకు న్నా నేర్చు చందంబునన్‌
నీ నామస్తుతు లాచరించు నెడల న్నే తప్పులుం గల్గినన్‌
వానిన్‌ లోఁగొనుమయ్య, తండ్రి, విహితవ్యాపార, నారాయణా! 3