పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిశోధనమున శతకకర్తనామము తెలియవచ్చెనేని కాలనిర్ణయమునకుఁ బ్రయత్నింప వీలుగల్గును. పోతనయే రచించెనని విశ్వసించువారికిఁ గవికులస్థలవాసాదులనుగూర్చి మాభాగవత పీఠికవలనఁ దెలిసికొనవచ్చును. నారాయణశతకవ్రాఁతప్రతులు గలవారు తమప్రతులలోనిపాఠములు క్రొత్తపద్యములు కవినామముగలపద్యము కలవేమో పరిశీలించి ప్రతి నొసంగుదురేని కృతజ్ఞులమై ముందుఁ జేయఁబోవు ముద్రణమున కీశతకమును సంస్కరించెదము.

సరిచూచుకొనుటకై వ్రాఁతప్రతి నొసంగి తోడ్పడిన జగ్గయ్యపేట వాస్తవ్యులగు ఊటుకూరి శ్రీరాములుగారియెడఁ గృతజ్ఞులము.

నందిగామ ఇట్లు భాషాసేవకులు,
1-6-26శేషాద్రిరమణకవులు.