పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పారఁగా
నీ పుణ్యాంగన సర్వజీవతతుల న్నిత్యంబు రక్షింపఁగా
నీ పాదోదక మీజగత్త్రయముల న్నిష్పాపులం జేయఁగా
నీ పెంపేమని చెప్పవచ్చు సుగుణా నిత్యాత్మ, నారాయణా! 8

శా. బ్రహ్మాండావలిలోన సత్వగుణివై బాహ్యంబునం దాదిమ
బ్రహ్మాఖ్యం బరతత్వబోధములకున్‌ భవ్యాధినాథుండవై
బ్రహ్మేంద్రామరవాయుభుక్పతులకున్‌ భావింప రాకున్న నా
జిహ్మవ్యాప్తుల నెన్న నాదు వశమే చిద్రూప, నారాయణా! 9

మ. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్‌ భృత్యులై
పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై
వరుస న్నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు, నారాయణా! 10

మ. మగమీనాకృతి వార్ధిఁ జొచ్చి యసురు న్మర్దించి యవ్వేదముల్‌
మగుడం దెచ్చి విరించి కిచ్చి యతని న్మన్నించి యేపారఁగాఁ
బగ సాధించిన దివ్యమూర్తి వని నే భావింతు నెల్లప్పుడున్‌
ఖగరాజధ్వజ భక్తవత్సల జగత్కారుణ్య, నారాయణా! 11

మ. అమరుల్‌ రాక్షసనాయకుల్‌ కడఁకతో నత్యంతసామర్థ్యులై
భ్రమరీదండము మందరాచలముగా