Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

63


కును, వా రితర రాజులతో సంధియేర్పాటులు చేసికొనుటకును బ్రిటిషువా రంగీకరించుచుండిరి. ఫ్రెంచివారి భయముపోయి నప్పటినుండియు బ్రిటిషుప్రభుత్వముయొక్కనీతి మర్యాదలును మార్పుజెందెను. 1850 ఆప్రాంతములలో జరిగిన సంధిపత్రములందు సమానప్రతిపత్తి గానరాదు. తమతోసంధి చేసికొను స్వదేశసంస్థానములు తమ యధికారమునకు లోబడిన సామంతరాజ్యము లను భావముతో నీ సంధిపత్రములు వ్రాయబడ సాగెను. స్వదేశసంస్థానము లితర సంస్థానములతో ప్రత్యేక సంధి యేర్పాటులు చేసికొనుటను ఆంగ్లేయకంపెనీ ప్రభుత్వము నిషేధించెను.

ఈసంస్థానములకు సహాయముచేయుట కను నెపముతో నాంగ్లేయ సైన్యములను ఆ యా సంస్థానములందు నిలిపియుంచి వానికగు వ్యయము నీ సంస్థానములు భరింపవలెనను నిర్బంధపు షరతులను సంధిపత్రములం దుదహరించిరి. ఈ సంస్థానముల రక్షణముకొరకు తాముంచిన సైన్యముల ఖర్చులక్రింద నొక నిర్ణీతపు మొత్తమును కప్పముగాచెల్లించు షరతుకూడా సంధులందు చేర్చిరి.

ఇట్లీసంస్థానములు రెక్కలువిరిగిన పక్షులస్థితికి గొనిరాబడెను. పూర్వము వీరికుండిన ' నేటివు' పటాలములు, ఫ్రెంచి యుద్యోగులుపోయి యిప్పు డాంగ్లేయ పటాలము లాసంస్థానములందు నిలిపి యుంచబడెను. పైకి వాని రక్షణకొఱకు, సహాయముకొఱకు అని చెప్పినను, నిజముగా నాంగ్లేయప్రభుత్వమువారికి వ్యతిరేకముగా వీ రెట్టి కుట్రలు జరిగించకుండా