62
భారత దేశమున
క్రోధముకలుగుచున్నది.” అని 1-2-1814 తేదీన వ్రాసికొన్నాడు. ఫిబ్రవరు 16 వ తేదీన “మనముఖ్యోద్దేశము బ్రిటిషుప్రభుత్వముయొక్క సర్వాధికారమును పేరునకు స్థిరముగా నెలకొల్పుటయై యుండవలెను. పేరునకు గాకపోయినను వాస్తవమునకు తక్కిన రాజులెల్లరు మనకు సామంతులుగా నుండునట్లు చేయవలెను. మొగలుచక్రవర్తి క్రింద నున్నట్లు గాకపోయినను మనము వారి రాజ్యములు వారి కుండనిచ్చినందులకు ప్రతిఫలముగా వారు తమసైనికబలములెల్ల మనకు సాయమున కుపయోగించి తోడ్పడవలెను. ఈ రాజులలో తగవులువచ్చినచో ఒండొరులతో పోరాడుకొనక ఈ రాజ్యముల సమ్మేళనములెల్ల అధిపతులమగు మనము చెప్పినట్లు వినవలెను. ఈ రెండు విషయములందు వారు మనకు లోబడియుండవలెను. ఈ షరతులకు కొందఱి రాజులనై నను మనము లోబరచినచో తక్కినవా రందఱును లోబడితీఱుదురు. ఢిల్లీ చక్రవర్తి యధికారమున కిది విరుద్ధమైనను వీలునుబట్టి మన మీ ఏర్పాటులు చేసికొని తీరవలెను. పరిస్థితులు చాల కష్టముగా నున్నవి, గాని అదనుకొఱకు వేచియుండి దీనిని సాధించెదను" అనినాడు.
ఫ్రెంచిజాతితోడి యుద్ధభయ ముండినందున ప్రారంభములో బ్రిటిషువారు భారతదేశ స్వదేశరాజులతోను, నవాబులతోను చేయుసంధిపత్రములు ఒకరికొకరు సహాయభూతులుగా నుండునట్టి సమానగౌరవ షరతులతో జరుగుచుండెను. ఫ్రెంచివారి నేదోవిధముగా సాధించవలెనని తమతో స్నేహముగ నుండిన స్వదేశ సంస్థానముల రాజులు సైన్యము లుంచుకొనుట