పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

భారత దేశమున


కనిపెట్టి యుండుటకును ఆంగ్లే య రాజ్యాధిపత్యమునకు తోడ్పడుటకునే యీ పద్ధతి అవలంబించబడెను. ఇది అనేక విధములుగా బిటీషువారికి లాభకారిగను స్వదేశసంస్థానములకు భరింపలేని భారముగను నుండెను. ఈ సైనిక వ్యయముల ఖాతా పెరుగుట, సంస్థానాధీశులు చెల్లించలేకుండుట, దీనికి ప్రతిఫలముగా రాజ్యభాగము లాంగ్లేయులకు వ్రాసి యివ్వబడుట, యింకననేకసౌకర్యము లొసగుట పరిపాటి యయ్యెను.

స్వదేశసంస్థానముల యాస్థానములలో నాంగ్లేయ ప్రభుత్వప్రతినిధులు రెసిడెంట్లనుపేరున నిలుపబడిరి. వీరునిజముగా నాంగ్లేయ గూఢచారులుగానుండి సంస్థానాధీశుల పట్ల కుట్రచేయుచు వారిపైన చాడీలు చెప్పుచు వారిని కూలద్రోయు చుండిరి. వీరిని చూచిన భయము అసహ్యము వృద్ధియయ్యెను. వీ రాయా సంస్థానములందు తమకుతంత్రములను ప్రయోగించుచు సర్వాధికారులుగ ప్రవర్తించుచుండిరి. [1]ఈ సంస్థానాధీశులతోడి సంబంధములందు క్రమక్రమముగా బ్రిటిషువారు తమ సర్వాధికారములను బిగువుచేయుచుండిరి. 1818 లో నాటి గవర్నరుజనరలగు హేస్టింగ్సు ఉదయపురము మహారాణాగారితో చేసిన సంధిపత్రము నుదాహరణముగా గైకొనవచ్చును.

దానిలో 3వ షరతు ఉదయపురము మహారాణా బ్రిటిషు ప్రభుత్వమునకు సర్వదా లోబడియుండి వారికి

  1. Private Journal of Moira Vol. I - Wellesly correspondence -Garwood.