Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/796

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

306

భారతదేశమున


హారములు. (అయితే నల్లమందు చేరదు) 8. బర్మాలోను, బొంబాయిలోనుమాత్రము అడవులు మంత్రులవశమున గలవు. 9. అభివృద్ధిశాఖ అనగా పరిశ్రమాభివృద్ధి శాఖ పరిశోధన, వృత్తివిద్య.

రాష్ట్రీయ శాసనసభలకు బాధ్యతలేని గవర్నరు కార్యనిర్వాహకసంఘమువారి వశమునగల రిజర్యుడు విషయములు:- 1. పల్లంసాగు, కాలువలు, మురుగు కాల్వలు, గట్టులు (Embankments ), నీటివసతి (Storage,) జలశక్తి (Power) 2 భూమిరివిన్యూల పరిపాలన, పన్నులు విధించుట, వసూలు చేయుట, భూమి అభివృద్ధి, వ్యవసాయఋణములు; 3 కఱవుల నివారణము, 4 న్యాయశాఖ; 5 పోలీసు; 6 వార్తాపత్రికలు 'పుస్తకములు, ముద్రాక్షరశాలలు, 7 కారాగారములు, సంస్కరణ కారాగారములు; 8 రాష్ట్రీయ పరపతిపైన ఋణము తెచ్చుట; 9 అడవులు; 10 కర్మాగారముల తనిఖీ, కార్మిక వివాదల పరిష్కారము, పారిశ్రామికభీమా, గృహ వసతులు,

__________