పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/795

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

305


సభలకు మొదటి సోపానముగ రాష్ట్రీయశాసనసభలు పెద్దవి చేయబడినవి. అందు నూటికి 70 మంది ఎన్నుకొనబడు సభ్యులు నియమింపబడుట కేర్పాటు చేయబడినది. దేశమునందలి జనసంఖ్యలో 50 లక్షల ప్రజలకు ఎన్నికహక్కు ఒసగబడినది. అనగా నూటికిద్దరువంతుస నియోజకులు గలరు. సౌకర్యముకొరకు దేశమెల్ల జిల్లాలుగ విభజింపబడినది. ప్రతిజిల్లాకును కలెక్టరు లనబడు వ్యవహార దండనాధికారులుందురు. బ్రిటీషు రాజ్యమున 273 జిల్లాలుకలవు. న్యాయపరిపాలనము కార్య నిర్వహణాధికారమును జిల్లా మేజస్ట్రేటులందు నెలకొల్పబడినది. వేర్వేరు రాష్ట్రములందు వేరువేరు ఉన్నతన్యాయస్థానము లేర్పరుపబడి ధర్మపరిపాలన చేయుచున్నవి. వానిపైన ఇంగ్లాండులోని ప్రీవీకవున్సిలు సభకు అప్పీలు అధికారములుకలవు.

రాష్ట్రియశాసనసభలకు బాధ్యతకల మంత్రుల వశమునగల ట్రాన్సుఫర్డు విషయములు:


1. స్థానికస్వపరిపాలన 2. మునిసిపాలిటీలు, జిల్లాబోర్డులు ఆరోగ్యము, వైద్యము, ఆసుపత్రులు, వైద్యవిద్య, 3. భారతీయులవిద్య, (కొన్ని విశ్వవిద్యాలయములుతప్ప). 4. రోడ్లు, బ్రిడ్జీలు, ట్రాములు మున్నగు పబ్లికువర్క్సు. అయితే పబ్లికువర్క్సులో వ్యవహారము, పల్లంసాగు, నీటిపారుదల(Irrigation) కాల్వలు మున్నగునవి చేరవు. (ఇవి రిజర్వుడు విషయములు) 5. వ్యవసాయము, చేపలు, 6 సహాకార సంఘములు, 7 సారాయము, కల్లుకు సంబంధించినంతవరకు అబ్కారీ వ్యవ