Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/793

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

303


లొసగబడి, రాష్ట్రీయ ప్రభుత్వములకు స్థానిక సంబంధములైన స్థానిక స్వపరిపాలనము, విద్య, ఆరోగ్యము, డి. పి. డబ్లియు శాఖ, నీటి సప్లయి, భూమి సిస్తులు, భూమి వ్యవహారములు కఱవుల నివారణ, వ్యవసాయము ఆబ్కారి మున్నగు విషయములందు కొన్ని నియమములకు లోబడి తమ రాజ్యమున అధికారములీయబడినవి. అయితే ఈ విషయములందు రాష్ట్రీయ శాసనసభలకు శాసన నిర్మాణాధికారమునకు కొంత లోపము గలదు. రాష్ట్రీయ శాసనసభలతో పాటు ఈవిషయములందు కేంద్ర శాసనసభలకు గూడ శాసన నిర్మాణాధికారము కలదు. అయితే సాధారణముగా స్థానిక విషయములందు కేంద్ర శాసనసభవారు శాసనములనుజేయరు గాని, చేయుట కభ్యంతరములేదు. దేశాదాయ మార్గములుకూడ కేంద్ర, రాష్ట్రీయ ప్రభుత్వములమధ్య విభజింపబడినవి. అట్లొసగబడిన ఆయా ఆదాయములను వసూలుచేసి, వ్యయముచేసికొనుటకు రాష్ట్రములకు పూర్ణాధికారము కలదు. అయితే కొన్నివిషయములలో గవర్నరుజనరలు అనుమతినిపొందవలెను.

రాష్ట్రీయ ప్రభుత్వములు

పెద్దరాష్ట్రములు, చిన్న పరగణాలుకలిపి 15 రాష్ట్రములుగ విభజింపబడినవి. చెన్నపట్నము, బొంబాయి, బంగాళా గవర్నరులు ఇంగ్లండులోని రాజ్యంగమంత్రితో తిన్నగ వ్యవహారములు, నుత్తరప్రత్యుత్తరములు జరుపవచ్చును. తక్కిన గవర్నరులు, పరిపాలకులు గవర్నరుజనరలు ద్వారాతప్ప అట్లొనర్పరాదు. అయితే భరతఖండ రాజ్యాంగవ్యవహారములందెల్ల