302
భారతదేశమున
6. పరిశ్రమలు, కార్మికశాఖ : పరిశ్రమలు, వస్తునిలయములు, స్టోరులు, పబ్లికువర్క్సు, తపాల తంతి కార్యాలయముల వ్యవహారము, సివిలు వాయు వ్యవస్థ, రాకపోకలు, పల్లంసాగు, కర్మాగారములు మున్నగువానిని గూర్చిన వ్యవహారములు.
7. సైనికశాఖ: సైనిక వ్యవస్థను, రక్షణవ్యవహారములను జూచును.
8. విద్య, ఆరోగ్య, భూముల శాఖ : విద్య, స్థానిక పరిపాలన, ఆరోగ్యము, కఱవులు, భూమిశిస్తు, సర్వే, వ్వవసాయము, అడవులు, ఆహారము మున్నగువానిపైన అధికారములు కలిగియుండును.
9. రైళ్ళశాఖ : రైలువ్యవహారముల జూచును.
అధికార విభజనము
1919 వ సంవత్సరములోని సంస్కరణల ప్రకారము వృద్దిక్రమానుగతముగా భారతదేశమునకు బాధ్యతాయుత పరిపాలనము నొసగుటయు, అందుకొరకు ముందుగ రాష్ట్రములందు స్వపరిపాలన విధానమును నెలకొల్పుటయు యుక్తమని పార్లమెంటువారు చట్టముననే ఉదాహరించినందున దేశ పరిపాలనముకొరకు కేంద్రప్రభుత్వమునకును, రాష్ట్రీయ ప్రభుత్వములకును ప్రభుత్వాధికారములు విభజింపబడినవి. కేంద్ర ప్రభుత్వమునకు దేశరక్షణము, రాజకీయ సంబంధములు, రైళ్లు, సుంకములు, రాకపోకలు, మున్నగు కేంద్రవిషయము