304
భారతదేశమున
గవర్నరులు, తక్కిన పరిపాలకులు గవర్నరు జనరలుకు లోబడవలెను.
తొమ్మిది పెద్దరాష్ట్రములలో రాష్ట్రీయ ప్రభుత్వముయొక్క కార్యనిర్వహణాధికారము క్రొత్త చట్టమువలన గవర్నరుక్రింద రెండుభాగములుగ విభజింపబడినది. ఒకభాగము గవర్నరును కార్యనిర్వాహకసంఘములునుగల రిజర్వుడుశాఖ, రెండవభాగము గవర్నరును ఆయననియమించుమంత్రులునుగల టాన్సుఫర్డుశాఖ. గవర్నరు, ఆయనకార్యనిర్వాహక సంఘమునందలి సభ్యులు బ్రిటీషునృపాలుని వలన నియమింపబడుదురు. ఈ ప్రభుత్వభాగమునకు రిజర్వుడు విషయము లనబడు ముఖ్యప్రభుత్వాధికారములెల్ల ఒసగబడినవి. రెండవ భాగములో గవర్నరుకు సలహానొసగు మంత్రులను శాసనసభయందలి ప్రజాప్రతినిధులలో నుండి నియమించును. ఆయన చిత్తము వచ్చినన్నాళ్ళు వీరుద్యోగము చేయుదురు. వీరికీ “టాన్సుఫర్డు" విషయములన బడ కొన్నిసామాన్య ప్రభుత్వాధికారములుగలవు.
గవర్నరు జనరలుకు గల అధికారములవంటి విశేషాధికారములేగల ఈగవర్నరులకు లోబడిన అధికారములుగల రాష్ట్రీయ శాసనసభలందు శాసన నిర్మాణాధికారము నెలకొల్పబడినది. ఈసభలును కేంద్రశాసనసభలవలెనే కొన్ని విషయములందు ఆదాయవ్యయములనుగూర్చి జోక్యము కలిగించుకొనరాదు. ట్రాన్సుఫర్డు విషయములందు మంత్రులు బాధ్యతకలిగి యుందురు. బాధ్యతాయుత పరిపాలనమున శాసన