Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/791

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

301


తీర్మానింతురు. ఆదాయవ్యయములందు కొన్ని పద్దులనుగూర్చి అసెంబ్లీసభవారు జోక్యము కలిగించుకొనరాదు. మఱియు అసెంబ్లీసభవారి ఇష్టానిష్టములతో నిమిత్తములేకుండా దేశముయొక్క శాంతికి, రక్షణకు నావశ్యకములైన ఆదాయ వ్యయములను గవర్నరుజనరలే చేయుట కధికారము కలదు. వారు శాసనసభలకు బాధ్యతకలిగి యుండక ఇంగ్లాండు పార్లమెంటువారికే బాధ్యతకలిగియున్నందున ప్రజాప్రతినిధుల శాసనసభల ప్రభుత్వాధికారములు తగ్గింపబడినవి. మఱియు గవర్నరుజనరలు కట్టి యధికారము లీయబడినవి.

1. కోశశాఖ : పబ్లికులెక్కలు, ఋణములు, నల్లమందు చలామణి, బ్యాంకి వ్యనహారములు, టంకశాలలు మొదలగు పనులు జూచును.

2. విదేశరాజకీయశాఖ: విదేశవ్యవహారములు, సంస్థాన వ్యవహారములు, సరిహద్దుజాతుల వ్యవహారములు జూచును.

3. స్వదేశశాఖ: (Home Department) ఆంతరంగిక రాజకీయ వ్యవహారములు, (సివిలుసర్వీసు) ఉద్యోగములు, న్యాయశాఖ వ్యవహారము, కారాగారములు, పోలీసువ్యవహారములు జూచును.

4. శాసనశాఖ: లామెంబరు శాసనసభలందు ప్రవేశపెట్టబడు ప్రభుత్వశాసనములను జూచును.

5. వాణిజ్యశాఖ: వర్తకము, నౌకావ్యాపారము, రేవులు మున్నగు పనులు జూచును.