పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/790

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

300

భారతదేశమున


ర్నరు జనరలునందు నెలకొల్పబడియున్నది. గవర్నరు జనరలు ఆంగ్లరాజ ప్రతినిధి. ఈతనిని బ్రిటీషు సార్వభౌముడే నియమించును. ఇతడు 5 సంవత్సరములుద్యోగము చేయును. గవర్నరు జనరలు కార్యాలోచన సభలో సర్వసేనానితో కలిసి 7 గురు సభ్యులుందురు. ఈ సభ్యులను కార్యనిర్వాహక సభ్యులందురు, సాధారణముగ వీరిలో అధిక సమ్మతినిబట్టి రాజకార్యములు జరుగును. గాని ఒక్కొకప్పుడు వీరిసలహాను విసర్జించి గవర్నరు జనరలు స్వయముగకూడ కార్యనిర్వహణము చేయవచ్చును.

భరతఖండములోని శాసన నిర్మాణాధికారము గవర్నరుజనరలు, రెండు శాసనసభలు గల కేంద్రశాసన సంస్థయందు నెలకొల్పబడినది. స్టేటుకవున్సిలులో 34 గురు ఎన్నుకొనబడిన సభ్యులును, 26 గురు ప్రభుత్వమువారిచే నియమింపబడిన సభ్యులు నుందురు. అసెంబ్లీసభలో 105 మంది ఎన్నుకొనబడినవారు, 40 మంది నియామకసభ్యులుకలరు. రాజ్యాంగచట్టమునందలి నియమములకు లోబడి ఉభయసభలు తీర్మానించినతప్ప ఏచిత్తుచట్టమును శాసనముకాదు. అవసర శాసనములను తానే చేయుటకును, శాసనసభలు తీర్మానించిన శాసనమును పునర్విమర్శ చేయగలందులకు, వెనుకకంపుటకు, దేశముయొక్క శాంతికి, రక్షణకు సంబంధించిన శాసనసభవారి చట్టములను ప్రత్యాఖ్య (Veto) (రద్దు) చేయుటకును గవర్నరు జనరలుకు విశేషాధికారములు కలవు. ప్రభుత్వకోశముయొక్క ఆదాయ వ్యయ ప్రణాళిక ఉభయసభలయందును చర్చకొర కంపబడును. అసెంబ్లీసభవా రా ప్రణాళికను