బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
55
దీనికే ఆవరణ (“రింగుఫెన్సు") నీతియని వ్యవహరించిరి. ఈ యుద్దేశమును పురస్కరించుకొనియే బక్సారు యుద్ధమైన పిదప మహారాష్ట్రుల భయములేకుండా కాపుదలగా నుండుటకు అయోధ్యను శాత్రవ మధ్యరాజ్యముగా నుంచి దీనిని నవాబునకే యిచ్చిరి. అట్లే టిప్పూ తదనంతరము మైసూరురాజ్యములో కొంత పూర్వరాజవంశీయున కిచ్చిరి. 1817 లో సీతాబాల్డీ యుద్ధమైన పిదప నాగపురమును భా౯స్లేరాజుకు మరలనిచ్చిరి. మొదటి సిక్కుయుద్ధానంతరము లాహోరు సంస్థానమును గూడ అట్లేయుంచిరి. ఆ కాలమున నాంగ్లేయకంపెనీప్రభుత్వము ఆయాస్వదేశ రాజులతోను నవాబులతోను చేసికొనిన సంధియొడంబడికలను చూచినచో ఆరాజులు నవాబులు అంతర్జాతీయ ధర్మమునుబట్టి సర్వాధికార ప్రభుత గల స్వతంత్రరాజులుగనే వ్యవహరించినట్లు గోచరించును. ఇంకా విశేష మేమనగా కంపెనీవారు చాలకాలము తమ అధికారము లెల్ల సర్వంసహాచక్రవర్తియగు ఢిల్లీపాదుషావలన సంక్రమించినట్లుగనే వ్యవహరించుచుండిరి. కాని షాఆలంచక్రవర్తి వీరి “సంరక్షణ నిర్బంధము” నుండి వెలువడి మహారాష్ట్రుల యండజేరి వారి ఖైదీయైనపిదప నీకపటనాటకము నాడుటకు వీలులేకపోయినది. అంతట నీ కంపెనీవారు దేశములోని తక్కిన సామంత పరిపాలకులవలెనే స్వతంత్రులై వ్యవహరింపసాగిరి. తాము భరింపలేని బరువులుమాత్రము నెత్తిపైన పెట్టుకొనకుండా ఉపాయముగా విజృంభింపసాగిరి.
కర్నాటక నవాబు తన రాజ్యముయొక్క మేనేజిమెం