Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

భారత దేశమున


టుకు లెక్క చెప్పి తన మధ్య ఫలసాయమును శిస్తుల ఆదాయమును తన కివ్వవలసినదని ఆంగ్లేయకంపెనీపై ఇంగ్లాండు - చాన్సరీకోర్టులో వ్యాజ్యము దాఖలుచేయగా ఆ వ్యాజ్యవిచారణకు నియమింపబడినకమీషనరగు “అయిర్" దొర ఈవ్యవహారము సామాన్య వ్యాజ్యము కాదనియు ఒకరికొకరు లోబడని రెండు రాజ్యములవారి మధ్యసంధి యొడంబడికలకు సంబంధించిన రాజకీయ వ్యవహారమనియు తీర్మానించి దావా త్రోసివేసెను. ఇట్లు కంపెనీవా రొక స్వతంత్ర రాజ్యపరిపాలకులను సూత్రము స్థిరపరుపబడెను.

II

స్వదేశ సంస్థానములతో నాంగ్లేయ కంపెనీవారవలంబించిన రాజ్యనీతిలోని రెండవ ఘట్టము, “సబార్డినేట్ అయిసొలేష౯" అనబడు విధానము. ఇది 1813 లో ప్రారంభమైనదని చెప్పవచ్చును. స్వదేశ సంస్థానాధీశుల స్వాతంత్ర్య గౌరవము అనవసరముగా స్వదేశరాజులతో జోక్యముకలిగించుకొన గూడదను భావము నశించి మెల్లగా నీరాజులను నవాబులను రాజ్యతంత్రమున నిరికించి కంపెనీవారి పలుకుబడిక్రింద నుంచి అధికారమునకు లోబరచుటకు ప్రయత్నములు జరిగెను.

1798-1905 మధ్య వెలస్లీగవర్నరు జనరలుగా నున్నప్పుడే అతడు దూరదృష్టితో నీస్వదేశరాజులు నవాబులు ఫ్రెంచి వారికి తోడ్పడకుండా నాంగ్లేయులకు వశులై యుండుమార్గము నాలోచించెను, గాని కేవలము కంపెనీవారికి లోబడియుండు నట్లు చేయజాలకపోయెను. వెల్లస్లీజేసిన సంధియొడంబడికలను