Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/762

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

272

భారతదేశమున


అందువలన 100 మంది నిజముగా సరిపోవు ఉద్యోగశాఖలకు: 140 మందిని నియమింపవలసి వచ్చుచున్నది.

ఇకపింఛనులువలన మనదేశమున కింకను నష్టముకలుగుచున్నది. పూర్వము ఐ. సి. యస్. ఉద్యోగుల జీతములనుండి నూటికి 4 వంతులచొప్పున పింఛను ఫండు కొరకు ప్రభుత్వము తీసికొని దానికి మఱికొంత సొమ్ముకలిపి ఏతరగతివాడైనను సాలుకు 1000 పౌనుల పింఛనిచ్చుచుండిరి. 1919 లో ఆ 4 వంతులు కంట్రిబ్యూషను తీసివేసిరి. పింఛను కూడా చాలా హెచ్చు చేయబడినది. ఇతర దేశములలో 65 సంవత్సరములకు పింఛనిచ్చుచుండగా నీ దేశములో 55 సంవత్సరములకే పింఛనిచ్చుపద్ధతి వీరికొరకే నెలకొల్పిరి. పెద్ద ఉద్యోగులకు సాలుకు 5 వేలు మొదలు 7 వేలు వరకు నిర్ణీతమొత్తము పింఛను నొసగుదురు. ఐ. సి. ఎస్. వారికి సాలుకు 1000 మొదలు 1500 పౌనుల పింఛనునిచ్చెదరు. పెద్ద న్యాయాధికారులకు 12 సంవత్సరముల కే పింఛనిచ్చెదరు. సీమలోనిచ్చు పింఛనులకు ఆదాయపుపన్ను లేదు. జబ్బుపడినచో దామాషాపింఛను నొసగుదురు. ఉద్యోగము రద్దుచేసినచో నష్టపరిహారపు అలవెన్సునిచ్చెదరు. పింఛనులను ఏక మొత్తముగా తీసికొనుపద్ధతి వీరికొరకే స్థాపింపబడినది. అన్ని ప్రభుత్వములలోని పెద్ద యుద్యోగుల జీతములుకలిపి సాలుకు 100 కోట్ల రూపాయ లున్నవి. రాష్ట్రీయాదాయములో నూటికి 40 వంతులీ యుద్యోగుల జీతములక్రింద ఖర్చుఅగుచున్నదని జాయింటు పొర్లిమెంటరీ కమిటీవారు 1934 లో చెప్పియున్నారు.