పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/761

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

271


పదవియు 450 రూపాయలతో ప్రారంభమై కళ్లుమూసికొనినను అనాయాసముగను అప్రయత్నముగను 2250 రూపాయల వరకును జీతము వృద్ధిని బడయును. అతనికిగల అలవెన్సులు ఇతర లాభములు కలుపుకొని 4 వేలరూపాయిలు ఇతనితిప్రతినెలయు చెందును. ఇండియ౯ మెడికల్ మిలిటరీ సర్వీసు వారికిగూడ ఇంతకన్న ఎక్కువగానే యున్నవిగాని తక్కువజీతములులేవు. ఈ జీతములసమస్య 147-150 పుటలలో కొంతచర్చింపబడినది. ఇక్కడ నిక కొన్నివిశేషములను చూతము: ప్రతి ఉద్యోగికి అనేక అలవెన్సులు సముద్రాంతర జీతములు, సెలవు కంట్రిబ్యూషను మారకముతేడా నష్టపరిహారము ఇళ్లు నౌకర్లు ప్రయాణపు సౌకర్యములు ఉద్యోగముమీద యితరలాభములునుండును. 25 పబ్లికు సెలవులు 20రోజుల క్యాజుయల్ లీవు, గాక పూర్తిజీతముపైన అర్ధజీతముపైన అనేకవిధములైన సెలవులు కలసి ఒక్కసారిగా 8 నెలలు తీసికొనవచ్చును. ఇట్లు 22 నెలల ఉద్యోగమునకు 5 నెలలు సెలవువచ్చుచుండును.

అనారోగ్యపుసెలవు, చదువుకొరకుసెలవు, కూడ కలవు. సెలవులో ఆదాయపు పన్ను ఉండదు, మారకము ఏరేటుగానున్నను రూపాయికి 20 పెన్నీలచొప్పున లెక్కచూచి జీతమిత్తురు. ఇన్ని లాభములున్నందునవేరే అదనపు ఖర్చులేకుండా విద్యాశాఖలోని దొరలు వేసంగి సెలవుల కింగ్లాండుకు పోవగలుగుదురు. ఇట్లు మొత్తము 30 సంవత్సరముల సర్వీసులో 23 సంవత్సరములకన్న పనిచేయుట తటస్థింపదు.