బ్రిటీష్‌రాజ్యతంత్రము
273
పైనచెప్పబడిన సాధారణ పింఛనులుగాక ఐ. సి. ఎస్. వారు మిలిటరీవారితోపాటు సర్వీసులో నుండగా ఆకస్మికముగా అంగవైకల్యము కలిగినను, దేహపీడగలిగినను, మరణించినను వీరికిని వీరిభార్యలకును బిడ్డలకును 'గ్రాట్యూయిటీ' అనబడు ఉపకారవిరాళముక్రింద కొన్ని పెద్దమొత్తము లిచ్చి సాలుకింత యసని ఉపకారవేతనముకూడా ప్రభుత్వమువా రిచ్చెదరు. వీనిని గూర్చిన వివరములు కొంతవరకుహైకోర్టుజడ్జీలుగానున్న ఐ. సి. యస్. వారిని గూర్చి వ్రాయుపట్ల 268 వ పుటలో చెప్పబడియున్నవి.
అలవెన్సులు: సీమకు పోయిన ఐ. సి. యస్. వారి కెల్లరకు సముద్రాంతర అలవెన్సు ఒసగబడును. ఇది నెల 1కి 30 పౌనుల వరకును నుండును. ఈ ఐరోపావారు సర్వీసులో నుండగా ఇంగ్లాండుకు పోయివచ్చుటకు రానుపోను నాలుగు ఫస్టుక్లాసు ఓడటిక్కెట్లు ఇవ్వబడును. ఇదిగాక మారకంతేడా నష్టపరిహారపు అలవెన్సుకూడా వీరికి వ్వబడును. ప్రభుత్వమువారి తప్పులకు ప్రజలు నష్టపడుచుండవలెను. ఇట్లే ఉద్యోగుల కివ్వబడు సౌకర్యములన్నియు కలిపి సాలుకు 1 1/2 కోట్ల రూపాయి లుండునని లీకమిషనువారు అంచనావేసినారు. గాని ఆదాయపుపన్ను విధింపనందున మనదేశమునకు కలుగుచున్న నష్టముగాని సీమలో చెల్లింవబడు పింఛనులుగాని దీనిలో చేరలేదు. ఐరోపా ఉద్యోగులతోపాటు భారతీయోద్యోగులకు గూడా ఇండియాలో ప్రయాణఫుఖర్చులు బత్తెము నిచ్చుచున్నారు. ఈబాపతు కేంద్రగవర్నమెంటువారే సాలుకు 140 లక్షల రూపాయిలు ఖర్చుపెట్టుచున్నారని ఇంచ్కేప్‌కమిటీ