బ్రిటీష్‌రాజ్యతంత్రము
255
విశాలదేశములో నేమూలనో యొకచోట కనబడు లోపములనుమాత్రమే పేర్కొని ఈ ప్రజలు స్వతంత్రులుగ నుండతగరని లోకమున ప్రచారము చేయుటయు బ్రిటీష్ రాజ్యతంత్రములో నొక ముఖ్యభాగముగా నున్నది. నిష్పక్షపాతియగు నేయాంగ్లేయుడైనను దేశభక్తుడగు నేభారతీయుడైనను భారతదేశ యథార్థచరిత్రను వ్రాసినచో నదిప్రచారములోనికి రాకుండ రాజద్రోహమని యణచివేయుటయో లేదా అదిపాఠశాలలందుపయోగింపనివ్వక పోవుటయో జరుగును. ఈ విషయమున ప్రభుత్వోద్యోగులగు తెల్లదొరలకన్న 'సర్కారు నౌకరుల'మని చెప్పుకొను నల్ల యుద్యోగులు మఱియు ముందంజవైచుచుందురు.
ఇట్లు తమ పూర్వులయొక్కయు దేశముయొక్కయు యథార్థచరిత్ర తెలిసికొనుట కవకాశములేక నీ ఆంగ్లేయబానిస విద్యనేర్చినభారతీయులలో బ్రిటీషు రాజ్యతంత్రము నిర్మించిన వైజ్ఞానిక దాస్యముననే పుట్టిపెరిగి చాలమంది తమదేశమునందుగాని మతధర్మములందుగాని వేషభాషలందుగాని అభిమానములేక కేవలము విజాతీయ సభ్యతలో వైజ్ఞానిక పారతంత్ర్యమున మునిగి బ్రిటీషు ప్రభువులను వారి వేషభాషల ననుకరించి మెకాలే చెప్పినట్లు జన్శవలన మాత్రమే భారతీయులుగనుండి రుచులందు అభిప్రాయములందు విజ్ఞానమందు ఆంగ్లేయులుగనేయుండి తదనుగుణముగనే ప్రవర్తించు బానిసబుద్ధికలవారుగా నున్నారు.
ఈ వైజ్ఞానిక పారతంత్ర్య ప్రభావమువలన దేశజనులలో