పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/744

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

254

భారతదేశమున


లేదు. మనపాఠశాలలందు పఠనీయపుస్తకములను వ్రాయు గ్రంథకర్తలు, చరిత్రకారులు ఆంగ్లేయులో లేక ఆంగ్ల క్రైస్తవాధికారుల తాబేదారులో లేదా వారి నాశ్రయించి తిరుగువారుగనో యుండిరి. ఇక చరిత్రలు వ్రాయువారు కేవలము ఆంగ్లగ్రంథకర్తలేతప్ప ఇతరులు లేనేలేరు. అందువలన హిందూదేశచరిత్రలో దేశీయచక్రవర్తులను, రాజులను, నవా బులను, సంస్కర్తలను, దేశోద్ధారకులనుగూర్చి వ్రాయుపట్ల అగౌరవముగ వ్రాయుట; అబద్దములు వ్రాయుట; బ్రిటీషువారు రాజ్యాక్రమణ చేసిననాటి యన్యాయములు గప్పిపుచ్చుట; మన ప్రజలపట్ల రాజులపట్ల నెన్నో యన్యాయములుచేసి ఎన్నో దుష్కృత్యముల కొడిగట్టిన క్లైవు, వారన్ హేస్టింగ్సు మొదలగువారి చర్యలను సమర్థించువారిని పొగడి వారియందు మనకు గౌరవముగలిగింపజూచుట; వీరి యన్యాయములకు గుఱియై నాశనమైన మన రాజులకు నవాబులకు లేనిపోని అవగుణములంటగట్టుట; మనజాతీయ చరిత్రలో ననేక యథార్థాంశములు మఱుగుపరచుట; కలకత్తా చీకటికొట్టు'కథలవంటి అనేక పుక్కిటిపురాణములను వ్యాప్తిపరచుట; భారతదేశచరిత్రలో దేశాభిమాన పూరితములగు ఘట్టము లెవ్వియు వర్ణింపబడకపోవుట; దేశస్వాతంత్ర్యముకొరకు, దేశోద్ధరణముకొరకు పాటుపడిన స్త్రీ పురుషులను రాజద్రోహులుగ పరిగణించి వారి చరిత్రములుకాదుకదా తుదకు నామములనైనను. చరిత్రలో నుదాహరింపకపోవుట; భారతీయుల సద్గుణములను గాని, ప్రభుమంత్రోత్సాహ శక్తులనుగాని ప్రకటింపక ఈ