పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/733

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
243
 


తీర్మానించినను ఏఖర్చునైనను గనర్నరు శాంక్షను చేసి బడ్జెటులో చేర్చవచ్చును. మరియు గవర్నరు శిఫారసు చేయనిది దేనికైనను సొమ్ము కావలెనని శాసనసభలో కోరుటకువీలులేదు. ఒక క్రొత్తపన్ను విధించుటకుగాని, ఒకపన్ను హెచ్చించుటకుగాని, దేశముయొక్క ద్రవ్యసంబంధ బాధ్యతల వ్యవహారములకుగాని, ఏవ్యయమైనను శాసనసభయొక్క వోటుకు లోబడునట్లు నిర్ణయించుటకుగాని సంబంధించిన శాసనమేదియు గవర్నరు శిఫారసుపైనతప్ప శాసనసభలో ప్రవేశపెట్టబడరాదు. ప్రజాప్రతినిధులకు బాధ్యులుగా నుండవలసిన మంత్రుల జీతములుకూడ రాష్ట్రశాసనసభల వోటుకు లోబడకపోవుటవిపరీతము. పైసంగతిసందర్భములవలన రాష్ట్రీయ వ్యవహారములం దెట్టి ముఖ్యమైనమార్పులను చేయుటకు వీలులేకుండా శాసనసభలపైన రాజ్యాంగచట్టము అనేకఆటంకములు కల్బించుచున్నదని స్పష్టమగుచున్నది. శాసననిర్మాణ విషయములందు ద్రవ్య వ్యవహారములందు గవర్నరే పెత్తనము గల సర్వాధికారిగా నుండి ప్రస్తుతపుపద్ధతులనే స్థిరముగా నుంచుననియు స్పష్టమగుచున్నది.

IV

గవర్నరుయక్క అధికారములు:

గవర్నరుజనరలు చలాయించు నట్టి నిరంకుశాధికారములనే గవర్నరును తనఅధికారమండలములో చలాయించును. ముఖ్యముగా శాసనసభవారు చేసిన ప్రతితీర్మానమునుగూడ