పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/734

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
244
భారతదేశమున
 


త్రోసివేయుటకు గవర్నరు కధికార మివ్వబడినది. మఱియు గవర్నరుజవరలుకుగల ప్రత్యేక బాధ్యతలవంటి అధికారములే గవర్నరులకును ఒసగబడినవి.

1. రాష్ట్రముయొక్క శాంతిభద్రతలకు అపాయము కలుగకుండ కాపాడుట.

2. అల్పసంఖ్యాకు లగు జనసంఘముల (మైనారిటీల). హక్కులు కాపాడుట.

3. సర్కారునౌకరుల హక్కులను కాపాడుట.

4. బ్రిటీషువాణిజ్యముపట్ల పరిశ్రమలపట్ల విచక్షణ చూపకుండ కాపాడుట. (చట్టముయొక్క 5 వ భాగములోని 3వ ప్రకరణములోని నిబంధనలు అమలుజరుగునట్లుచూచుట. )

5. స్వదేశ సంస్థానముల హక్కులు సంరక్షించుట.

6. గవర్నరుజనరలు జారీచేయు ఆజ్ఞలను అమలు జరిగించుట.

ఈ ప్రత్యేక బాధ్యతలకు సంబంధించిన వ్యవహారములను గవర్నరు కేవలము తనస్వతంత్రవివేచనతోనే నిర్వహించును. ఈ విషయములను గూర్చి అతడు జరిగించుచర్య ఏ కారణమువలనను విమర్శింపబడరాదు. ఈశాసనసభలతో నిమిత్తము లేకుండ ఆర్డినెన్సులను, 'గవర్నరుచట్టము'లనబడు శాశ్వతశాసనములను గూడ శాసించుటకు గవర్నరు కధికారముగలదు. ప్రత్యేకబాధ్యతలనబడు అధికారములయొక్క అంతరార్థ మిదివరకే చెప్పబడియున్నది. శాంతిభద్రతల విషయములో