242
భారతదేశమున
త్రోసివేయవచ్చును. చట్టముయొక్క 5 వ భాగము 3 వ ప్రకరణమున చెప్పబడినట్లు ప్రత్యక్షముగాగాని ప్రచ్ఛన్నముగాగాని బ్రిటీషు వాణిజ్యపారిశ్రామిక హక్కులపట్ల వ్యతిరేకముగా విచక్షణపుచూపు ఏశాసనమును రాష్ట్రీయశాసననిర్మాణసంస్థ చేయవీలులేదు. ఎట్టిది విచక్షణగా పరిగణింపబడునో నిర్ణయించువాడును గవర్నరే. ద్రవ్యవిషయములందు రాష్ట్రీయ శాసనసంస్థయొక్క అధికారము లింకను సంకుచితములై యుండును. రాష్ట్రీయవ్యయము రెండుతరగతులుగా విభజింపబడును. (1) రాష్ట్రముయొక్క రెవిన్యూ ఆదాయముపైన బద్దతచేయబడినది. (2) రాష్ట్రముయొక్క రివిన్యూ ఆదాయములోనుండి ఖర్చు పెట్టదలచినది. మొదటితరగతి వ్యయము శాసనసభల వోటుకు లోబడదు. ఆతరగతిలో ఈక్రిందివ్యయములు చేరియున్నవి:
1. గవర్నరుయొక్క జీతము, అలవెన్సులు, ఆ ఉద్యోగహోదాకు సంబంధించిన ఇతర ఖర్చులు.
2. రాష్ట్రము బాధ్యతవహించు ఋణవ్యయములు.
3. మంత్రులయొక్కయు అడ్వకేటుజనరలుయొక్కయు జీతములు, అలవెన్సులు.
4. హైకోర్టు జడ్జీలజీతములు, అలవెన్సులు.
5. మినహాయింపబడిన ప్రదేశముల వ్యయములు.
6. చట్టమువలన రివిన్యూపైన బద్దతకాబడినట్లు ప్రకటింపబడిన ఇతరవ్యయములు. తక్కినబాపతుల వ్యయము శాసనసభ వోటుకులోబడునుగాని శాసనసభ వ్యతిరేకముగా