పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/711

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
221
 


సంకుచితపరచుపద్దతిని బుద్ధిపూర్వకముగా ప్రయోగించి యుండుటయే. చలామణి మారకము, ద్రవ్యపద్ధతులపైన గవర్నరు జనరలుకు ఇవ్వబడిన సర్వాధికారము, ఇంగ్లీషు పారిశ్రామికులకు అమితముగా తోడ్పడునటుల నుపయోగింపబడుననుటకు సందియములేదు.

ప్రభుత్వ ఋణము:

రెండవప్రకరణము ఋణములు చేయుట, లెక్కల తనిఖీ ( ఆడిటు ) కిను సంబంధించినది. 161 వ శెక్షను ప్రకారము, భారతదేశ రివిన్యూ ఆదాయపు హామీపైన ఋణము తెచ్చుటకు ఇండియారాజ్యాంగ కార్యదర్శికిగల అధికారము ఫెడరేషను స్థాపింపబడగనే నిలిచిపోవును. భారతదేశ ఋణములలో చాలవరకు మనము భరింపనక్కరలేనివని కరాచీ కాంగ్రెసుమహాసభ చేసిన తీర్మానమునకు భయపడి యీ శెక్షను నిర్మించియుందురు. నిజమునకు ఇంగ్లీషువారి కిక్కడ శాశ్వతముగా ఘనీభవించియున్న హక్కులు పోవునేమో యనుభయము, వానిని కాపాడుకొను ఆత్రతయు, ఇండియా చట్టమునం దెల్లయెడల గానవచ్చుచున్నవి. ఋణముల విషయమున రాజ్యాంగకార్యదర్శి యధికారము పోయినదని పేరే గాని, 315 వ సెక్షను ప్రకారము ఫెడరేషను స్థాపింపబడువరకు అనిర్ణీతమగు నీమధ్యకాలమున రాజ్యాంగకార్యదర్శి యెంత సొమ్మైనను వెనుకటివలెనే అప్పు చేయుచుండ వచ్చునని శాసింపబడినది. 162 వ సెక్షను ప్రకారము ఫెడరలు శాసనసభ నిర్ణయించు పరిమితిలోపల, వారునిర్ణయించు హామీల