Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/712

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

222

భారతదేశమున


నొసగి గవర్నరుజనరలే అప్పుచేయవచ్చునని నిర్ణయింపబడినది. 163 వ సెక్షనుగూడ అట్లే రాష్ట్రముల విషయములో రాష్ట్రీయగవర్నరులును, రాష్ట్రశాసనసభలును నిర్ణయించు హద్దులలో అప్పుచేయవచ్చునని విధించుచున్నది. సొమ్ము లేనప్పుడు గవర్నరుజనరలుల యిష్టప్రకారము అప్పుచేయకుండ ఏశాసనసభ నిరోధించును? గవర్నరును గవర్నరుజనరలు నిందు తెలివితేటల నుపయోగించి పనిచేయగలరు.

ఆడిటు ( లెక్కలతనిఖీ):

166 వ సెక్షనుప్రకారము భారతదేశమున కొక ఆడిటరు జనరలు ఆంగ్లరాజువలన నియమింపబడును. ఈ ఉద్యోగనిర్మాణముదీని పుట్టుపూర్వోత్తరములనుబట్టి ఇది కేవలము ఇంగ్లీషువారి కొరకేర్పడిన కోటబురుజేయని యూహింపవచ్చును.. 170వ సెక్షనుప్రకారము గవర్నరుజనరలు స్వతంత్రవివేచన నుపయోగించి ఇండియన్ హోంఅక్కౌంటుల ఆడిటరనబడునింకొక యుద్యోగిని నియమించునట! ఫెడరేషనుయొక్క రివిన్యూఆదాయముకు సంబంధించినట్టియు- రైల్వేఅథారిటీ యొక్కయు, రాష్ట్రములయొక్కయు, వ్యవహారములలో ఇంగ్లాండులో జరుపబడు వ్యవహారములనుగూర్చిన (ఆడిటు) లెక్కతనిఖీపనులు నిర్వహించును. ఈ పనులన్నియు నిర్వహించతగిన ఆడిటరుజనరలొకడు నియమింపబడుచునేయుండగా మరల నీయదనపు ఉద్యోగమేల సృజియించవలెను? దీనివలన మనకు అధికధనవ్యయము తప్ప వేరు లాభము లేదు. 'రాజ్యాంగ సంస్కరణము ' అనగనే అధికవ్యయము లుండును సుడీయను ఆంగ్లరాజ్యనీతివిధానమే బ్రిటిషు