పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/710

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

భారతదేశమున


రిజర్వు బ్యాంకు:

152 వ శెక్షనుగూడ దేశముయొక్క ఆర్ధికవిధానమునకు సంబంధించినదే. దీనినిబట్టి రిజర్వు బ్యాంకియొక్క గవర్నరులను డిప్యూటీ గవర్నరులను నియమించుటకును, తొలగించుటకును సెంట్రల్ బోర్డునురద్దుపరచుటకును అందుకు సంబంధించిన ఇతరచర్యలు తీసికొనుటకును, తుద కాబ్యాంకిని విలయము చేయుటకునుగూడ గవర్నరుజనరలుకు అధికారము కలదు. 153 వ శెక్షనుప్రకారము ఫెడరేషనుయొక్క చలామణి నాణెములకు సంబంధించిన చిత్తుచట్టములు, సవరణలు, గవర్నరుజనరలుయొక్క అనుమతిని ముందుగా పొందియుండవలెను. ఈరెండు శెక్షనులు కలిపి చదివినచో మన కొనుగోలు శక్తియు, పరపతియు గవర్నరుజనరలు చిత్తముపైన నాధార పడియుండునని తెలియగలదు. కేంద్రబ్యాంకి వ్యవస్థయొక్క ఆర్థికపద్ధతులను పరిశీలించినచో దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించుటకొరకుగాని, వానిని నిర్మూలనము చేయుటకొరకు గాని ఈ అధికారముల నెట్లెట్లుపయోగింప వీలుకలదో తెలియును. దేశముయొక్క సంపదను కొల్లగొనుటలో నీక్రయాధికారశక్తి యెంతబలవంతమగు ఆయుధమో అర్థశాస్త్రజ్ఞు లెరుగుదురు. బంగారును దేశమువెలుపలికి తరలించునట్లుగాని, దేశములోని కాకర్షించి రప్పించునట్లుగాని చేయగలదీ శక్తియే. 1933 వ సంవత్సరపు ఆర్ధికమహాసభలో “కౌలు" గారు సెలవిచ్చినట్లు మనదేశములోనుండి బంగారు ప్రవహించిపోవుటకు గల కాగణము ఇండియాప్రభుత్వ మీతరుణమున చలామణిని