Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/708

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

భారతదేశమున


నముగాని తత్క్షణమే గవర్నరు జనరలువలన త్రోసివేయబడును. అతని తీర్పునకు తిరుగులేదు.

ఇట్లు భారతదేశమునకు తగిలింపబడిన బ్రిటీషువారి మూలధనముయొక్క ఉరిత్రాళ్లు ఎప్పటివలెనే గట్టిగా బిగియించి యుంచబడి దేశమును ఆర్థికముగా అభివృద్ధిలేకుండ వెనుకబడియుండులాగున జేయుచున్నవి.

119 వ సెక్షను సాంకేతికవృత్తివిద్యల ప్రావీణ్యతకు, అర్హతలకు సంబంధించినది. 120 వ సెక్షను వైద్యవృత్తికి సంబంధించినది. కంపెనీల విషయములో ఇంగ్లీషువారిశ్రేయముకొర కేయేశాసనవిధులు శాసింపబడినవో ఆవిధులే ఈవృత్తుల విషయమునగూడ ఏకరవుపెట్టబడి మనకపారనష్టమును కలిగించునవిగను వారికి లాభము కలిగించునవిగను నున్నవి.

III

చట్టములోని ఏడవభాగముయొక్క మొదటిప్రకరణము ద్రవ్య సంబంధమైనది. 137 వ శెక్షనునుబట్టి కొన్ని వారసత్వపు బన్నులు, “టర్మినలు” పన్నులు, కేవురుసుములు ఫెడరేషను విధించివసూలుచేసి రాష్ట్రములకు పంచియివ్వమని యున్నది. తన ఉపయోగనిమిత్తము నిలిపి యుంచుకొనుటకు వానిపైన “సర్చార్జీల"ను కూడ ఫెడరేషను విధించవచ్చును. 168 వ సెక్షను వ్యవసాయేతర ఆదాయములపైన పన్నులను గూర్చినది. దీనిప్రకారము ఆదాయపుపన్ను ఫెడరేషనే విధించి వసూలుపరచి సభాయుతుడగు రాజు జారీచేయు కవున్సిలు ఆర్డ