పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/709

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

219


రులో విధింపబడిన ప్రకారము నూటికింతయని నిర్ణయింపబడిన కొన్నివంతులు నిలువయుంచి మిగతమొత్తము ఆయారాష్ట్రముల కొసగబడును. నిలువయుంచుకొనునది క్రమక్రమముగా తగ్గించబడును. ఆదాయపుపన్నుపైన సర్చార్జీలు విధించుటకు తన ఉపయోగముకొరకు నిలువయుంచుకొనుటకు ఫెడరేషను కధికారమున్నది. (ఈపంపిణీలవిధానములో గవర్నరు జనరలు కొంత రాజ్యతంత్రము ప్రయోగింప గలుగును. )

140 వ సెక్షనుప్రకారము ఉప్పుపన్ను ఆబ్కారీపన్ను ఎగుమతిసుంకములు, ఫెడరేషను విధించి వసూలు చేయును. అయితే ఫెడరలు శాసనసభ నిర్ణయించిన ప్రకారము, ఈ సొమ్ము అంతయుగాని కొంతగాని రాష్ట్రములకు పంచియివ్వ వచ్చును. రాష్ట్రములకు సంబంధముగల పన్నులు విధించుటను గూర్చిన శాసనములు ప్రవేశపెట్టుటకు ముందుగా గవర్నరు జనరలు అనుమతిని పొంది తీరవలెనని 141 వ సెక్షనుశాసించుచున్నది. దేశములోని ఒకతరగతికి నింకొకతరగతికిని రాజకీయ హక్కుల విషయమున ఉద్యోగములవిషయమున స్పర్థ వైషమ్యము పుట్టునట్లు చాణక్యనీతిని ప్రయోగించు రీతిగనే రాజ్యతంత్ర నిపుణుడగు గవర్నరుజనరలు ఒకరాష్ట్రమున కింకొక రాష్ట్రముతో కలహములు వైషమ్యములు కలిగించి అన్ని విషయములందు తనపంతము నెరవేర్చు కొనగలుగును. మత ప్రధానమగు సాంఘికవైషమ్యములే గాక రాష్ట్రభక్తి ప్రధానమగు సాంఘికవైషమ్యములుగూడ ప్రజ్వరిల్లుట కీఫెడరలు ద్రవ్యపద్దతి పునాదులు వేయుచున్నది.