Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/707

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

217


బ్రిటిషువారికీదేశమునగల పెట్టుబళ్ళయొక్క మొత్తము గమనించినతప్ప ఈశాసన నిబంధనలయొక్క అంతరార్థము తెలియదు. బ్రిటిషువా రీదేశములో పెట్టినపెట్టుబడి యొక్క మొ త్తము 1300 కోట్లరూపాయిలు. 1931-32లో ఈదేశములో వ్యాపారము చేయుచుండిన బ్రిటీషుకంపెనీల సంఖ్య 911. చెల్లింపబడిన మొత్తము మూలధనము 1008 కోట్లరూపాయిలు. ఈకంపెనీలలో ముఖ్యమైనవి బ్యాంకులు, భీమాకంపెనీలు, రైళ్లు, ట్రాముదారులు, వ్యాపారపారిశ్రామక కంపెనీలు, జూటుమిల్లులు, గనులు, ఈపెట్టుబళ్ళపైన ప్రతిసాలున 161 కోట్ల రూపాయిలు వడ్డీరూపముగాను లాభముగాను మన దేశమునుండి పోవుచున్నవి. దేశముయొక్క ఓడవ్యాపారమంతయు బ్రిటీషు ఓడలపైననే చేయబడుచున్నది. నూటికి 2 వంతులు సముద్రవ్యాపారము 8 వంతులు కోస్తా వ్యాపారముమాత్రము మన ఓడలపైన జరుగుచున్నది.

మన దేశముయొక్క ఆర్ధికోత్పత్తి మార్గములపైన ఈబ్రిటీషు వాణిజ్యవ్యాపార బాధ్యస్థులే పెత్తనము వహించి భారతీయ కంపెనీలపట్లను, వ్యాపారులపట్లను బాహాటముగా విచక్షణ చూపుచున్నారు. భారతీయ వాణిజ్యవ్యాపారములు పరిశ్రమలు అభివృద్ధికావలెనన్న చో బలవంతులగు ఈపోటీదారుల బారినుండి సంరక్షింపబడి తీరవలెను. అయితే ఇది చేయుటకు వీలు లేకుండా క్రొత్తరాజ్యాంగము అరికట్టుచున్నది. బ్రిటీషు వాణిజ్యవ్యాపారులతో నిమిత్తములేకుండ భారతీయపరిశ్రమలను వాణిజ్యమును ప్రోత్సహించునట్టి ఏశాస