పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/704

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
214
భారతదేశమున
 


చుచు మనకు హానికలిగించుచున్న వని సెంట్రలుబ్యాంకింగు ఎంక్వైరీ కమిటీవారి నివేదికలలో శ్రీ మనూ సుబేదారుగారు తమ ఆక్షేపణలో చెప్పియున్నారు. మర్కెంటైల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాయొక్క సభాపతియగు బ్యూమాంట్ పీస్ గారు ఈ దేశములోని మూలధనము మనదేశమునుండి బయటకు ప్రవహించుటకు బ్రిటిష్ బ్యాంకులే కారణముగ నున్నవని చెప్పిరనియు శ్రీమనూ సుబేదారుగారు బయల్పరచినారు. ఇండియా దేశీయు లెంత విద్యా పారంగతులయినను, ఎంత తెలివికలవారయిననుగూడ వారిని త్రోసిపుచ్చి ఇంగ్లాండుబ్యాంకులలోని రెండవరకపు ఆంగ్లేయ గుమాస్తాలకే బ్రిటిషుబ్యాంకు లవకాశ మిచ్చుచుండునని ఠాకూరు గారు తమగ్రంథమున వ్రాసియున్నారు. ఈ శెక్షను ప్రకారము ఫెడరలుకంపెనీ 'లా' ధర్మములో బ్రిటీషుకంపెనీలు సర్వాధికారముగల స్వతంత్రసంస్థలుగా చేయబడినట్లు తోచగలదు. రాజ్యాంగచట్టముద్వారా గవర్నరు జనరలున కీయబడిన సర్వాధికారములకన్నగూడ ఈనిరంకుశ ఆర్థికసామ్రాజ్యతత్వమే అత్యంతభయంకరముగ నున్నది. ఏలన నిది మన సంపదలనెల్ల తోడివేయుటకు కారణమగుచున్నది. 113వ శెక్షను యొక్క 2 వ ఉపపరిచ్చేదము ప్రకారము ప్రతి బ్రిటీషుకంపెనీకిని మన కంపెనీలకువలెనే పన్నుల విషయములో అంతగాని, కొంతగాని మినహాయింపులు చేసి అధికాదరము జూపవలసిన బాధ్యత మనపైన మోపబడినది. ఈ శెక్షనులోకూడ ఒక “పరస్పర మర్యాదల' సూత్రము చేర్చబడినది. ఇదియంతయు