పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/703

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
213
 


మునకు పోయి అచ్చట ఆస్తిని సంపాదించినకాని, ఉద్యోగము చేస్తేకాని, వర్తకముచేసికాని జీవించువా రరుదుగా నున్నారు. అక్కడనుండి యీ దేశమునకు వచ్చి పడువారి సంఖ్యయే లెక్కకు మీరియున్నది. ఇట్టితరి పరస్పరమర్యాదలసూత్రము ఎంతఅన్యాయమో యూహింపుడు. మరియు బహిరంగముగా మనవారిపైన ప్రత్యక్షపు నిషేధములు లేకపోయినను ఇంగ్లాండులోని ఆచారవ్యవహారములే మనవారి కచ్చటకుబోయి ధనార్జనచేయ వీలులేకుండ చేయుచున్నవి.

మనకంపెనీ “లా” (ధర్మశాస్త్రవిధులు) ఇంగ్లీషుకంపెనీలకు వాని వాటాదారులకు, ఉద్యోగులకు, ఏజెంట్లకు, వాని నౌకర్లకుగూడ వర్తించదని 113 వ శెక్షను శాసించివైచినది. మన ఫెడరలు శాసనసభలవారు వారి నిండియాలోనే కంపెనీ స్థాపించమనికాని, వారి కార్యస్థానముల నిచ్చటనే పెట్టుకొనమనికాని, వానిమూలధనము నీదేశపు రూపాయలలోనే యుంచుకొనవలసినదని గాని ఎట్టి నిరోధమునుగాని చేయుచు శాసింప రాదనియు నీశెక్షను విధించుచున్నది. ఇందువలన నీకంపెనీలతో వ్యవహారము జరుపు మనదేశీయులకు ఆ కంపెనీల లోతుపాతులుగాని, మంచిచెడ్డలుగాని తెలియుట కెట్టి యవకాశము నుండదు. ఆ కంపెనీలు దివాలా తీసినప్పుడువాని అస్తిపయిన విదేశ ఋణదాతలకే (చార్టీ) హామీలుండును గాన మన ఋణదాతలకు మిగులున దేమియు నుండదు. ఈ విదేశపుకంపెనీలన్నీయు మన దేశవర్తకమునెల్ల విదేశీయుల చేతులలోనుంచుటకే తమ అపారమగు బలము నుపయోగిం