పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/705

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
215
 


బాగుగనే యున్నది. కాని ఇంగ్లీషువారి కంపెనీలను ప్రోత్సహించుటకొరకు ఇండియా ప్రభుత్వపు బొక్కసమేల సష్టపడవలయునో తెలియుటలేదు. మన పరిశ్రమలను నాశనముచేయుట తప్ప ఆకంపెనీలు మనకు చేయు మేలేమి? ఇండియాలోని పారిశ్రామికుని పోత్సహించుటకొరకేగదా అతనిపైన తక్కువపన్ను విధించి తక్కిన జనసామాన్యము హెచ్చుపన్ను భరించుట! బ్రిటిషుపారిశ్రామికునికొరకును కంపెనీలకొరకునుగూడ మనము హెచ్చుపన్నులనేల భరించవలె? ఇది యన్యాయమేగాని మనము నోరెత్తుటకు వీలులేదు. ఒక్క స్త్రీపురుషులయొక్క లింగభేదములోతప్ప తక్కిన అన్ని మార్పులనుకూడచేయుటకు అన్ని విషయములందు ఇంగ్లీషు పార్లమెంటుకు సర్వాధికారములుగలవని రాజ్యాంగధర్మశాస్త్రజ్ఞు లుద్ఘోషించు మాట నిజమేకదా!

115 వ శెక్షను ప్రకారము మనకోస్తా ఓడల విషయములోకూడ మనమేమి చేసికొనుటకు వీలులేదు. ఓడవిషయములోగాని కెప్తానును గూర్చికాని ఉద్యోగులను గూర్చికాని ప్రయాణీకులనుగూర్చికాని సరకువిషయములో గానిమనవారిపట్ల పక్షపాతము చూపించు శాసనము లెవ్వియుగూడ మనము చేసికొనరాదట ! ఇక్కడకూడ మనకన్నులు మూయుటకొరకు పరస్పరమర్యాదలసూత్రమును వ్రాసినారు. ఇంగ్లాండువారు మనపైన విధింపనిహద్దులను వారిపైన మనమువిధింపరాదట! మనయోడలేవైనను వారితీరములందుతిరుగుచున్న గదా, వారు మనపై నేవైన నిషేధములు ప్రయోగించినారని చెప్పుకొనుట.