210
భారతదేశమున
పన్ను విధింపబడినట్టి కాని, పన్ను విధింపతగినట్టికాని ఆదాయముల విషయములో మన ఫెడరలుపన్నుయొక్క భారమును తగ్గించుటనుగూర్చి బాధింపగల ఏశాసనముగానిసవరణగాని గవర్నరు జనరలు అనుజ్ఞను ముందుగా పొందనిది ఫెడరలు శాసనసభలు చేయుటకు వీలులేదు. సాధారణముగా ఒకదేశములో స్థాపింపబడిన సంస్థ ఇంకొకదేశములో వ్యాపారము చేయునప్పుడు, రెండుమారులు పన్నులు భరించి నష్టపడ కుండ ఒకచోట వసూలుచేయబడినపన్ను మొత్తమును రెండుదేశముల ప్రభుత్వములు పంచుకొను అంతర్జాతీయ ఏర్పాటులు చేయబడియున్నవి. ఈమర్యాద ననుసరించియే అధినివేశరాజ్యములందు అదేవిధమగు పన్నులు వసూలుచేయబడిన ఆదాయముల విషయములో ఇంగ్లాండు ప్రభుత్వము పన్నులో మినహాయింపులు చేయుచున్నది. ఇండియానుండి సొమ్ముపుచ్చుకొను ( బాండు) ఋణపత్రదారులు, పింఛనుదారులు, ఉద్యోగులు, వ్యాపారము నడుపువారు ఆయామొత్తములను ఇంగ్లీషుసవరనులలో మనవల్ల పుచ్చుకొనుచు ఆయాదాయముల పైన ఇంగ్లాండు ప్రభుత్వమునకు ఆదాయపుబన్ను చెల్లించుచున్నారు. ఇట్లు మనప్రభుత్వమునకు రావలసినపన్ను రాకుండపోవు చున్నది. ఆ పన్నులబాపతు అమితమొత్తము మనకే యున్నచో ప్రభుత్వాదాయము కొరకు మనము భరించవలసి వచ్చుచున్నభారములో కొంతవరకైన తగ్గింప వీలుండెడిది. ఇట్టి నవరసుబాండు పత్రములపైన భారతదేశము సాలీనా 4కోట్లు