బ్రిటీష్‌రాజ్యతంత్రము
209
ఎనిమిదవ పరిచ్చేదము:
రాజ్యాంగ చట్టములోని కట్టు దిట్టములు.
I
శాసన నిర్మాణాధికారములో మినహాయింపులు
పైన చెప్పబడిన అన్యాయపు నియమములు చాలక కాబోలు, ఫెడరలు రాష్ట్రీయ శాసనాధికారములపైన ఇంకను చాలా హద్దులేర్పరుపబడినవి. 109 వ శెక్షనులోనిహద్దులు ఆర్థిక స్వాతంత్ర్యము నింకను సంకుచితపరచుచున్నవి. బ్రిటీషు ఇండియాలో కాపురముండువారిపైనకన్న కాపురముండనివారిపైన హెచ్చుపన్నులు వేయుటను గూర్చికాని బ్రిటీషు ఇండియాలోనే పూర్ణముగా నిర్వహింపబడని, లేదా నడుపబడని కంపెనీలపైన హెచ్చుపన్ను విధించుటనుగూర్చికాని గవర్నరు జనరలుయొక్క అనుమతిని ముందుగా పొందనిదీ ఫెడరలు శాసనసభలు చర్యదీసికొనరాదట. ఇందువలన మన దేశములోనికి వచ్చి కొన్నాళ్లుండి లాభము లార్జించిపోవు విదేశీయుల పైనగాని మనదేశములో స్థాపించినడుపు కంపెనీలవిషయములో గాని మనశాసనసభలు మనదేశీయ వ్యాపారక్షేమములకొరకు గూడ పన్నులువేయ వీలులేదన్న మాట! ఇక మన వర్తక వ్యాపారములు బాగుపడుటెట్లు?
ఈ 108 వ శెక్షనులోని జి. 1. గురుతు ఉపపరిచ్చేదము ప్రపంచములోని అంతర్జాతీయ ఆచారమునకును ధర్మమునకును గూడ విరుద్ధముగానున్నది. ఇంగ్లాండు వేల్సు స్కాట్లాండులలో