పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/701

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
211
 


చెల్లించుచున్నదని ఆర్థికశాస్త్రజ్ఞులగు ప్రొఫెసరు కె. టి. షా గారు అంచనా వేసియున్నారు.

బ్రిటిషు పింఛనుదారులయొక్కయు, వర్తకులయొక్కయు ఆదాయములరీత్యా మనకు వచ్చుచున్న నష్టము అపారము. పన్నులనునవి ప్రభుత్వముచేయు సేవ కొకవిధమగు ప్రతిఫలముగా చెల్లింపబడుచున్నవి. ఇంగ్లీషువర్తకులు మన కేవిధములైనపన్నులు చెల్లించకుండగనే మనప్రభుత్వమువలన క్షేమ లాభములను పొంద జూచుచున్నారు. ఇండియాచట్ట మీ యన్యాయమును శాశ్వతముగా నిలిపినది.

II

బ్రిటీషువారి శాశ్వత హక్కులు

రాజ్యాంగచట్టము యొక్క 5 వ భాగములోని 3వ “ప్రకరణము" "విచక్షణల" కు సంబంధించిన దైనందున ఆర్ధికముగా చాల ముఖ్యమైనది. 111 వ శెక్షను బ్రిటిష్ వారీ దేశములోనికి స్వేచ్చగా వలస వచ్చుటకు అవకాశ మిచ్చుచున్నది. బిటీషువా రిచ్చట ఆస్తిని సంపాదించుటకు ఆస్తిని కలిగి అనుభవించుటకును దాని నన్యాక్రాంతము చేయుటకును, ఉద్యోగములు చేయుటకు, ఏవృత్తినిగాని, వ్యాపారమునుగాని, పనినిగాని చేసికొనుటకును బ్రిటీషువారికి సంపూర్ణ స్వాతంత్ర్యము నొసగుచున్నది. ఈ శెక్షనును పురస్కరించుకొని ఉద్యోగములు హెచ్చుగా భారతీయుల వశము చేయవలెనను విధానమును సైతము వృధ చేయ