బ్రిటీష్‌రాజ్యతంత్రము
197
రెండవతరగతి వ్యయములు అనగా ఫెడరేషనుయొక్క రివిన్యూలోనుండి ఖర్చుపెట్టదలచు వ్యయముల విషయమై వోటుచేయుటకు శాసనసభలకు వీలుకలదు. అయితే వారు తగ్గించినట్టి లేక తీసివేసినట్టి వ్యయములను మరలచేర్చి మంజూరు (శాంక్షను) చేయు అధికారము గవర్నరు జనరలుకు కలదు. దీనిలో గమనించవలసిన ముఖ్యవిషయ మేమనగా శాసనసభ వోటుచేయుటకు వీలులేని వ్యయముమొత్తము ఫెడరల్ వ్యయములో నూటికి ఎనుబదివంతులైనను ఉండును. మిగిలిన ఇరువదివంతులైనను ఫెడరలు శాసనసభలకుపూర్ణ అధికారముండదు. ఏలన, గవర్నరుజనరలు తన స్వతంత్ర వివేచన నుపయోగించి రెండుశాసనసభలయొక్క అభిప్రాయమును త్రోసిరాజనవచ్చును.
గవర్నరు జనరలుయొక్కయు, శాసనసభలకు బాధ్యత వహింపని అతని తాబేదారులయొక్కయు జీతములు శాసనసభ వోటుకు లోబడకపోవుట బాగుగనే యున్నదిగాని శాసనసభలకు బాధ్యత వహింపవలసిన మంత్రులయొక్క జీతబత్తెములు గూడ ఆ శాసనసభవారి వోటుకు లోబడకపోవుటలోని అంతరార్ధ మేమిటో ! రాజ్యాంగచట్టముయొక్క 10-వ శెక్షను, ఈమంత్రులు గవర్నరు జసరలుయొక్క చిత్తము వచ్చినంతకాలము మాత్రమే ఉద్యోగమున నుందురని శాసించుటను బట్టియే దీనిభావము విదితమగుచున్నది. మంత్రులు, ప్రజాభిప్రాయము ప్రకారము నడుచుకొనుటకుగాని ప్రజు శ్రేయముకొరకు పాటుపడుటకుగాని, దేశముయొక్క ఆర్ధిక